రామ్ గోపాల్ వర్మతో అషురెడ్డి బోల్డ్ ఇంటర్వ్యూపై ఆమె తల్లి రియాక్షన్.. వీడియో ఇదిగో
- సమాజానికి సందేశం ఇచ్చావంటూ ప్రశంస
- ఇంటర్వ్యూ బోల్డ్ గా, స్ట్రాంగ్ గా ఉందని కామెంట్
- వీడియోను షేర్ చేసిన అషురెడ్డి, ఆర్జీవీ
మరి, ఆ ఇంటర్వ్యూని చూసిన అషురెడ్డి తల్లి స్పందన ఎలా ఉంటుంది? ఇదిగో ఆ వీడియోనే అషురెడ్డి షేర్ చేసింది. 'ఇదీ.. మా అమ్మ నా దగ్గరకు వచ్చి చెప్పింది' అంటూ పోస్ట్ పెట్టింది. ఆ వీడియోలో అషును ఆమె మెచ్చుకుంది. ఇంటర్వ్యూ బాగుందని, బోల్డ్ గా, స్ట్రాంగ్ గా ఉందని చెప్పింది. సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చేలా ఉందని అషును ప్రశంసించింది. ఆ వీడియోను రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.