రామ్ చరణ్-శంకర్ చిత్రం... ఆశ్చర్యపరిచేలా ఫస్ట్ పోస్టర్ విడుదల!
- దిల్ రాజు నిర్మాణంలో భారీ చిత్రం
- సౌతిండియాలో మరో క్రేజీ ప్రాజెక్టు
- రామ్ చరణ్ సరసన కియారా
- త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న చిత్రం
ఇక ఈ సినిమా ప్రారంభం సందర్భంగా చిత్రయూనిట్ ఆశ్చర్యకరమైన రీతిలో ఓ ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారాలతో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు, కీలకపాత్రధారి సునీల్, ఈ చిత్రానికి పనిచేస్తున్న టెక్నీషియన్లు అందరూ సూట్లు ధరించి దర్శనమిస్తారు. వీ ఆర్ కమింగ్ అంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ పెట్టారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్లో ఇది 50వ చిత్రం కావడంతో ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.