'రిపబ్లిక్' నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
- దేవ కట్టా దర్శకత్వంలో సాయితేజ్
- రాజకీయాల నేపథ్యంలో సాగే కథ
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
"సూడబోదుమా .. ఆడబోదుమా .. సెయ్యి సెయ్యి కలిపి సేరబోదుమా .. " అంటూ ఈ పాట సాగుతోంది. జాతర వాతావరణంలో జనంతో కలిసి హీరో ఆడిపాడే పాటగా ఇది కనిపిస్తుంది. పాటలో హీరోతో పాటు హీరోయిన్ కి కూడా చోటు ఉంది. జానపద బాణీలో ఊపుతో హుషారుగా ఈ పాట నడుస్తోంది.
ఆంధ్రలో విశేషంగా జరిగే పెద్దింట్లమ్మ జాతర నేపథ్యంలో సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ బావుంది .. యూత్ పై మంచి ఉత్సాహభరితమైన స్టెప్స్ ను ఆయన కంపోజ్ చేశాడు. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న సాయితేజ్ ముచ్చట ఈ సినిమా తీరుస్తుందేమో చూడాలి.