థియేటర్లలోనే గోపీచంద్ 'సీటీమార్'
- క్రీడా నేపథ్యంలో సాగే కథ
- గోపీచంద్ జోడీగా తమన్నా
- సెప్టెంబర్ లో థియేటర్లలో విడుదల
- క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు
ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్ రావడం వలన నిర్మాతలు ఆ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దాంతో ఇక ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో నిర్మాతలు ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను సెప్టెంబర్ లో థియేటర్లలో విడుదల చేయనున్నట్టు చెబుతూ, ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తామని చెప్పారు. కొంతకాలంగా వరుస పరాజయాలతో ఉన్న గోపీచంద్ ఈ సినిమాతో గట్టెక్కుతాడేమో చూడాలి.