వివేకానంద రెడ్డి హత్య కేసు: ఎంపీ అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడి విచారణ
- 68వ రోజు కొనసాగిన సీబీఐ విచారణ
- అనుమానితుడిగా దేవిరెడ్డి శంకర్ రెడ్డి
- ఆయనతో పాటు మరో వ్యక్తి హాజరు
అందులో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్ రెడ్డి హాజరయ్యారు. వివేకా హత్య కేసులో శంకర్ రెడ్డి అనుమానితుడిగా ఉన్నారు. ఆయనతో పాటు పులివెందుల క్యాంప్ ఆఫీసులో పనిచేసే రఘునాథరెడ్డి అనే వ్యక్తి కూడా విచారణకు వచ్చారు.