టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ గొప్ప మనసు.. చదువుకున్న స్కూలుకు రూ. 18 లక్షలతో భవన నిర్మాణం
- రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్‌తో కలిసి భవనాన్ని ప్రారంభించిన సుకుమార్ దంపతులు
- మట్టపర్రు గ్రామాభివృద్ధికి ముందుంటానని స్పష్టీకరణ
- తాను చదువుకున్న తరగతి గదులను చూస్తూ జ్ఞాపకాలు నెమరువేసుకున్న సుకుమార్
అనంతరం సుకుమార్ మాట్లాడుతూ.. మట్టపర్రు గ్రామాభివృద్ధికి తానెప్పుడూ ముందుంటానని అన్నారు. తన తండ్రి పేరుతో స్కూలు భవనం నిర్మించి, ప్రారంభించిన క్షణాలు మర్చిపోలేనివంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తాను చదువుకున్న తరగతి గదులను చూస్తూ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సుకుమార్ ఆ పాఠశాలలో చదువుకున్నప్పటి రికార్డును ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ ఫ్రేమ్ కట్టించి సుకుమార్‌కు అందజేశారు. తాను దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ సెప్టెంబరులో తిరిగి ప్రారంభమవుతుందని సుకుమార్ తెలిపారు. ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉంటుందని చెప్పారు.