ధనుష్ తో జతకట్టనున్న పూజ హెగ్డే?
- తెలుగు, హిందీ ప్రాజక్టులతో పూజ బిజీ
- తెలుగులో ధనుష్ రెండు ప్రాజక్టులు
- రెండో ప్రాజక్టులో నాయికగా పూజ
- సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణం
ఇప్పటికే పలు అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ధనుష్ ఇప్పుడు తెలుగులో రెండు స్ట్రెయిట్ సినిమాలు చేయడానికి అంగీకరించాడు. వీటిలో మొదటి చిత్రానికి శేఖర్ కమ్ముల, రెండో చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తారు. ఇప్పుడీ రెండో చిత్రంలో కథానాయికగా పూజ హెగ్డే నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది.