బాలకృష్ణను 'మా' అధ్యక్షుడిగా ఎన్నుకుంటే చాలా సంతోషిస్తా: మంచు విష్ణు
- ఇండస్ట్రీ పెద్దలు ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పోటీ నుంచి తప్పుకుంటా
- నాగబాబు నాకు తండ్రిలాంటి వ్యక్తి
- రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి
బాలయ్యతో పాటు ఆయన జనరేషన్ కి చెందిన కొందరు నటీనటులు 'మా' ఎన్నికల్లో నిలబడలేదని, వారిలో ఎవరు అధ్యక్షుడు అయినా తనకు అభ్యంతరం లేదని, తనకు సోదరుడి లాంటి వ్యక్తి అయిన బాలయ్య అధ్యక్షుడు అయితే తనకు ఇంకా సంతోషమని మంచు విష్ణు అన్నారు. నాగబాబు తనకు తండ్రిలాంటి వ్యక్తి అని, ఆయనంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.
'మా' శాశ్వత భవన నిర్మాణంపై తన ప్లాన్ ఏమిటో చెప్పాలని నాగబాబు వేసిన ప్రశ్నకు బదులుగా... రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. వారితో మాట్లాడి 'మా'కు కావాల్సిన భూమిని సంపాదించగలననే నమ్మకం ఉందని చెప్పారు.