రైతు కంట కన్నీరు చిందిన రాజ్యం బాగుపడదు: సీఎం కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ
- రైతుల సమస్యలపై సర్కారును నిలదీసిన కోమటిరెడ్డి
- రైతులను చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం
- ఇప్పటికీ ధాన్యం బకాయిలు చెల్లించలేదని వెల్లడి
- ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరిక
వర్షాల సీజన్ షురూ అయిందని, రైతులు నాట్లు వేయడం ప్రారంభించినా గానీ ధాన్యం బకాయిల బిల్లులు చెల్లించకపోవడం ఏంటని ప్రశ్నించారు. బకాయిలు అందక లక్షమంది రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని తెలిపారు. కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకు ఉరుకులు పరుగుల మీద నిధులు విడుదల చేసినప్పుడు, అదే విధంగా రైతుల బకాయిలు ఎందుకు విడుదల చేయడంలేదని కోమటిరెడ్డి నిలదీశారు.