'వినాయక చవితి'కి రానున్న 'అఖండ'!
- చివరిదశ చిత్రీకరణలో 'అఖండ'
- త్వరలో షూటింగు పార్టు పూర్తి
- దసరా ఆశలు లేనట్టే
- ముందుగానే రంగంలోకి
'ఆర్ ఆర్ ఆర్' సినిమా దసరాకి రాకపోవచ్చనే ఉద్దేశంతో 'ఆచార్య' .. 'రాధేశ్యామ్' .. 'అఖండ' ఆ దిశగా అడుగులు వేశాయి. కానీ నిన్న 'ఆర్ ఆర్ ఆర్' నుంచి మేకింగ్ వీడియోను వదిలారు. ఈ వీడియో చివర్లో రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ముందుగా చెప్పినట్టుగానే దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నామని స్పష్టత ఇచ్చేశారు. దాంతో ఇప్పుడు మిగతా సినిమాలు తమ విడుదల సమయాలను పరిశీలించుకునే పనిలో పడ్డాయి. అలా 'అఖండ' సినిమాను వినాయక చవితికి ప్లాన్ చేస్తున్నారనే ఒక టాక్ మాత్రం బలంగానే వినిపిస్తోంది.