'హైవే'పైకి వచ్చేసిన మానస రాధాకృష్ణన్!
- గుహన్ దర్శకత్వంలో 'హైవే'
- రోడ్ క్రైమ్ థ్రిల్లర్ గా సాగే కథ
- కొత్త కథానాయిక పరిచయం
- రీసెంట్ గా మొదలైన రెగ్యులర్ షూటింగ్
ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన నాయికగా 'మానస రాధాకృష్ణన్' ను తీసుకున్నారు. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన మానస, ఇప్పుడిప్పుడే అక్కడ కథానాయికగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పవన్ - హరీశ్ శంకర్ సినిమాలో ఈ అమ్మాయే హీరోయిన్ అనే టాక్ బలంగానే వినిపించింది. అలా ఈ అమ్మాయి ఇక్కడివారికి పరిచయమైంది. చక్కని కనుముక్కుతీరుతో అందంగా .. ఆకర్షణీయంగా ఉన్న మానస, ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ రెగ్యులర్ షూటింగులో పాల్గొంటోంది. మరి మానస కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.