ఆసక్తిని రేపుతున్నఆర్య 'సర్పట్ట' ట్రైలర్
- బాక్సింగ్ నేపథ్యంలో 'సర్పట్ట'
- ఆర్య భార్య పాత్రలో దుషారా విజయన్
- అమెజాన్ లో ఈ నెల 22న రిలీజ్
- ఈ సినిమాపై ఆర్య ఆశలు
కథానాయకుడి నేపథ్యం .. ఆయన బాక్సర్ గా మారడం .. రాణించడంపై ఫోకస్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 80వ దశకం నాటి కథ కావడంతో, అప్పటి వేషధారణ .. హెయిర్ స్టైల్ ను చూపించడం చాలా కష్టం. కానీ దర్శకుడు పా రంజిత్ ఆ విషయంలో చాలా శ్రద్ధ పెట్టినట్టుగానే కనిపిస్తున్నాడు. పశుపతి .. అనుపమ నటరాజన్ .. సంచిత నటరాజన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై ఆర్య గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు. ఈ సినిమాకి ఏ స్థాయి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.