'దృశ్యం 2' డీల్ కూడా కుదిరిందట!
- అమెజాన్ ప్రైమ్ కి 'నారప్ప'
- 'దృశ్యం 2' కూడా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైనే
- హాట్ స్టార్ వారికి సొంతం అంటూ టాక్
- త్వరలో రానున్న స్పష్టత
ఈ నేపథ్యంలో 'దృశ్యం 2' సినిమాను కూడా ఓటీటీలోనే విడుదల చేయనున్నారనే టాక్ వచ్చింది. ఈ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ వారికే ఇవ్వనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత డిస్నీ హాట్ స్టార్ వారితో చర్చలు జరుగుతున్నట్టుగా చెప్పుకున్నారు. వాళ్లతోనే డీల్ కుదిరిందనేది తాజా సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావలసి ఉంది. మలయాళ 'దృశ్యం 2' కూడా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైనే విడుదలై అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. కథాబలం కలిగిన ఈ సినిమాకి తెలుగులోను విశేషమైన ఆదరణ లభించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.