వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆనంద్ దేవరకొండ!
- 'దొరసాని'తో తొలి ప్రయత్నం
- తాజా చిత్రంగా 'పుష్పక విమానం'
- నెక్స్ట్ సినిమాగా 'హైవే'
- లైన్లో నాలుగు సినిమాలు
ఆ తరువాత ఆనంద్ దేవరకొండ వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు. '118' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కేవీ గుహన్ దర్శకత్వంలో 'హైవే' చేయనున్నాడు. 'కలర్ ఫోటో' సినిమాకి కథను అందించిన సాయి రాజేశ్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో .. హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో .. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఒక్కో సినిమాను చేయనున్నాడు. ఇవన్నీ కూడా ఒకదాని తరువాత ఒకటి సెట్స్ పైకి వెళ్లనున్నాయి .. అదే క్రమంలో థియేటర్స్ లో దిగనున్నాయి.