ఈ నెల 15న 'వలిమై' ఫస్టులుక్ రిలీజ్!
- ముగింపు దశలో 'వలిమై'
- నిర్మాతగా బోనీ కపూర్
- విలన్ పాత్రలో కార్తికేయ
- దీపావళికి భారీ విడుదల
అయితే నేడు .. రేపు అంటూ అభిమానులు ఈ ఫస్టులుక్ కోసం వెయిట్ చేస్తూ, అసహనానికి లోనయ్యారు. దాంతో ఈ సినిమా మేకర్స్ ఈ నెల 15వ తేదీన ఫస్టులుక్ పోస్టర్ ను .. మోషన్ పోస్టర్ టీజర్ ను వదలాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. దాదాపు ఈ తేదీ ఖరారైనట్టేనని అంటున్నారు. హుమా ఖురేషి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తుండటం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో బోనీకపూర్ ఉన్నాడు. సాధ్యమైనంత వరకు 'దీపావళి' బరిలోనే ఈ సినిమాను నిలపాలనే ఉద్దేశంతో ఉన్నారు.