కూతురు దర్శకత్వంలో రజనీకాంత్!
- రజనీ తాజా చిత్రంగా 'అన్నాత్తే'
- దీపావళికి భారీ విడుదల
- తండ్రి కోసం స్క్రిప్ట్ రెడీ చేసిన సౌందర్య
- త్వరలో రానున్న అధికారిక ప్రకటన
రజనీకాంత్ తాజా చిత్రంగా 'అన్నాత్తే' రూపొందుతోంది. ఈ సినిమాలోను రజనీకాంత్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలోనే రజనీ ఈ సినిమాను పూర్తి చేయడం విశేషం. ఈ దీపావళికి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉండనుంది? అది ఎప్పుడు మొదలవుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో రజనీ తన తదుపరి సినిమాను కూతురు సౌందర్య దర్శకత్వంలో చేయాలనుకుంటున్నారట. ఆ తరువాత ఇక విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను సౌందర్య పూర్తిచేసిందని అంటున్నారు. అమెరికా నుంచి రజనీ తిరిగి రాగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు.