వైజాగ్ లో 'సర్కారువారి పాట'
- పరశురామ్ దర్శకత్వం
- మహేశ్ సరసన కీర్తి సురేశ్
- మళ్లీ సెట్స్ పైకి వెళుతున్న టీమ్
- సంక్రాంతికి భారీ విడుదల
పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ కనిపించనుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి ఉంది. యాక్షన్ .. ఎమోషన్ కలిసిన వినోదభరితమైన కథ ఇది. పరశురామ్ మార్కు ఎంటర్టైనర్ అన్నమాట. బ్యాంకు స్కాముల చుట్టూ కథ తిరుగుతున్నప్పటికీ, కావలసినంత కామెడీ ఉంటుందని అంటున్నారు. తెలుగులో ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన హిట్ లేని కీర్తి సురేశ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. 'సంక్రాంతి'కి ఈ సినిమా థియేటర్లకు రానుంది.