మళ్లీ షూటింగు మొదలెట్టేసిన 'పుష్ప'
- కరోనా కారణంగా ఆగిన షూటింగు
- తాజా షెడ్యూల్ హైదరాబాద్ లోనే
- ఈ రోజునే మళ్లీ సెట్స్ పైకి
- 45 రోజుల పాటు సాగనున్న షూటింగు
ఈ రోజు నుంచి 45 రోజుల వరకూ నాన్ స్టాప్ గా షూటింగు జరిగేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ షెడ్యూల్ తో 'పుష్ప' పార్టు 1కి సంబంధించిన షూటింగు పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు. అడవిలోకి చొరబడిన అవినీతి .. అక్కడ జరిగే దౌర్జన్యాలు .. ఎర్రచందనం అక్రమరవాణ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రష్మిక కథానాయికగా అలరించనున్న ఈ సినిమాలో, అల్లు అర్జున్ చెల్లెలిగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి మాలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పరిచయమవుతున్నాడు.