గూండాయిజం చేస్తే లోపలకు పోతావ్: రేవంత్ రెడ్డికి సుధీర్ రెడ్డి వార్నింగ్
- రేవంత్ రెడ్డి గూండా మాదిరి మాట్లాడుతున్నారు
- ప్రచారం కోసం బజారు భాష వాడుతున్నారు
- సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసినట్టు మేమెప్పుడూ చెప్పలేదు
సీఎల్సీ అంటే తమ అబ్బ సొత్త కాదు, రేవంత్ అబ్బ సొత్తు కాదని సుధీర్ అన్నారు. సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసినట్టు తాము ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్యానించారు. ఒక గ్రూపు ఎమ్మెల్యేలం మాత్రమే టీఆర్ఎస్ లో విలీనమయ్యామని చెప్పారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో లేరని విమర్శించారు. 2017లో రాజీనామా చేసినట్టు స్పీకర్ కు రేవంత్ రాజీనామా లేఖ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.