పట్టాలెక్కనున్న రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్
- నిన్న శంకర్ ను కలిసిన చరణ్, దిల్ రాజు
- తమ కొత్త చిత్రం గురించి చర్చలు
- సెప్టెంబరు లోపు సెట్స్ పైకి చిత్రం
- ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న చరణ్
ఇటీవల శంకర్ కు, లైకా ప్రొడక్షన్స్ సంస్థకు ఇండియన్-2 చిత్రానికి సంబంధించిన వివాదం నడిచింది. అయితే కోర్టులో శంకర్ కు అనుకూల ఉత్తర్వులు రావడంతో రామ్ చరణ్ తో చిత్రానికి మార్గం సుగమం అయింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది. ఈ సినిమా తర్వాత శంకర్ తో సినిమాను పట్టాలెక్కించేందుకు రామ్ చరణ్ కూడా ఉత్సాహంగా ఉన్నాడు.
ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది.