మహేశ్ బాబు కోసం స్పీడ్ పెంచిన త్రివిక్రమ్!
- మహేశ్ తో త్రివిక్రమ్ మూవీ
- సంగీత దర్శకుడిగా తమన్
- ఇద్దరు కథానాయికలకు చోటు
- దసరాకి షూటింగ్ మొదలు
కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటారట. వాళ్ల ఎంపికను త్వరలోనే పూర్తి చేయనున్నట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ నాటికి అన్ని పనులను పూర్తిచేసుకుని, దసరా సందర్భంగా షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. గతంలో మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అతడు'.. 'ఖలేజా' అభిమానులకు అలా గుర్తుండిపోయాయి. అందువలన మూడోసారి ఈ కాంబినేషన్లో రానున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను త్రివిక్రమ్ ఎంతవరకూ అందుకుంటారో చూడాలి మరి.