నిర్మాతగా మారిన అవిక గోర్!
- చైతూ సరసన 'థ్యాంక్యూ'
- కల్యాణ్ దేవ్ జోడీగా మరో మూవీ
- సాయి రోనక్ తో లవ్ స్టోరీ
- 'పాప్ కార్న్' టైటిల్ ఖరారు
ఆచార్య క్రియేషన్స్ బ్యానర్ పై సాయిరోనక్ హీరోగా ఒక ప్రేమకథా చిత్రం రూపొందుతోంది. మురళీనాగ శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అవిక స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించిన అవిక, ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా మారింది. ఈ సినిమాకి 'పాప్ కార్న్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఒకరంటే ఒకరికి ఎంతమాత్రం పడని ఒక అబ్బాయి .. ఒక అమ్మాయి చిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకుంటారు. ప్రమాదకరమైన ఆ పరిస్థితుల్లో వాళ్లు ఏం చేశారనేదే కథ. శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, యూత్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.