'అఖండ' ఐటమ్ కోసం రాయ్ లక్ష్మీ!
- మళ్లీ సెట్స్ పైకి 'అఖండ'
- నెక్స్ట్ షెడ్యూల్లో రాయ్ లక్ష్మీ
- తమన్ నుంచి మసాలా ట్యూన్
- కథానాయికగా ప్రగ్యా
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా 'అఖండ' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. మిగతా భాగం చిత్రీకరణ కోసం త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ సినిమా కోసం తమన్ ఒక మసాలా సాంగ్ ను అందించాడట. ఈ పాట కోసం రాయ్ లక్ష్మిని తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. తదుపరి షెడ్యూల్లో బాలకృష్ణ - రాయ్ లక్ష్మి తదితరులపై ఈ పాటను చిత్రీకరించనున్నారట. ఈ సినిమాకి ఈ సాంగ్ హైలైట్ కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.