తన సిబ్బంది మొత్తానికి కరోనా వ్యాక్సినేషన్ చేయించిన దిల్ రాజు
- ఎస్వీసీ బ్యానర్ పై చిత్రాలు నిర్మిస్తున్న దిల్ రాజు
- ఎస్వీసీ బ్యానర్లో 200 మంది సిబ్బంది
- సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తపడిన దిల్ రాజు
- చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయంలో నేడు వ్యాక్సినేషన్
తన నిర్మాణ సంస్థ కార్యాలయంలో నేడు వ్యాక్సినేషన్ ఏర్పాటు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో పనిచేసే 200 మంది సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ డోసులు ఇప్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకుంది.