పాతికేళ్ల క్రితం ఏం జరిగిందంటే.. అంటున్న రవితేజ!
- 'క్రాక్'తో దొరికిన హిట్
- థియేటర్లకి రానున్న 'ఖిలాడి'
- శరత్ మండవకి దర్శకుడిగా ఛాన్స్
- త్వరలో రెగ్యులర్ షూటింగ్
రవితేజ తదుపరి సినిమా శరత్ మండవ దర్శకత్వంలో ఉండనుంది. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో రవితేజ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందట. 25 ఏళ్లక్రితం వెనక్కి వెళ్లి అక్కడ ఈ కథ నడుస్తుందని అంటున్నారు. అందుకు సంబంధించిన సెట్స్ వేయిస్తున్నారని చెబుతున్నారు. ఆల్రెడీ ఇంతకుముందే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుందని అంటున్నారు. ఇందులోను ఇద్దరు కథానాయికలు సందడి చేస్తారట.