సంతోష్ శోభన్ జోడీగా మెహ్రీన్ .. దర్శకుడిగా మారుతి!
- అందాల నాయికగా క్రేజ్
- కరోనా కారణంగా పెళ్లి వాయిదా
- మారుతి దర్శకత్వంలో మరో సినిమా
ఈ గ్యాపులో సినిమాలు చేయాలని మెహ్రీన్ నిర్ణయించుకుందట. అందువల్లనే మారుతి దర్శకత్వంలో ఆమె ఓ సినిమా చేస్తోందని అంటున్నారు. సంతోష్ శోభన్ కథానాయకుడిగా మారుతి ఒక చిన్న సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో సంతోష్ శోభన్ జోడీగా ఆయన మెహ్రీన్ ను ఒప్పించాడని అంటున్నారు. గతంలో తనకి 'మహానుభావుడు' వంటి హిట్ ఇచ్చిన కారణంగా మెహ్రీన్ అంగీకరించిందని చెబుతున్నారు. హైదరాబాద్ .. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగు జరుగుతోందని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.