బాలకృష్ణ సినిమాని వదులుకున్న రకుల్?
- బాలకృష్ణ నెక్స్ట్ మూవీకి సన్నాహాలు
- దర్శకుడిగా గోపీచంద్ మలినేని
- ఇద్దరు కథానాయికల అవసరం
- శ్రుతి హాసన్ కి డేట్స్ సమస్య
ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం శ్రుతి హాసన్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ 'సలార్' సినిమా కారణంగా డేట్లు కుదరడం లేదని ఆమె చెప్పిందట. ఈ నేపథ్యంలోనే రకుల్ ను సంప్రదించగా, హిందీ ప్రాజెక్టుల కారణంగా తాను బిజీగా ఉన్నానని అందట. దాంతో ఇక ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే ఒక ఆలోచనతో తర్జన భర్జనలు పడుతున్నారట. అసలే ఇద్దరు కథానాయికలు అవసరమని అంటున్నారు. గోపీచంద్ మలినేని ఎవరిని రంగంలోకి దింపుతాడో చూడాలి మరి.