పట్టాలపైనే ఉన్న 'ఖైదీ' సీక్వెల్!
- కార్తి కెరియర్లో 'ఖైదీ' సూపర్ హిట్
- సీక్వెల్ ఉండకపోవచ్చనే టాక్
- క్లారిటీ ఇచ్చిన నిర్మాత
- 'సర్దార్'తో బిజీగా ఉన్న కార్తి
అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుంటుందని కార్తి అభిమానులు భావించారు. సీక్వెల్ తప్పకుండా ఉంటుందని ఇటీవల ఒక వేదికపై కార్తి చెప్పాడు కూడా. అయితే ఆ తరువాత ఎక్కడా ఈ ప్రస్తావన లేకపోవడంతో, ఈ ప్రాజెక్టు ఉండదనే అంతా అనుకున్నారు. కానీ తాజాగా నిర్మాత ఎస్.ఆర్. ప్రభు మాట్లాడుతూ, ఈ సినిమాకి సీక్వెల్ ఉందని స్పష్టం చేశాడు. సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అవుతోందనీ .. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అన్నాడు. ప్రస్తుతం 'సర్దార్' సినిమా చేస్తున్న కార్తి, ఆ తరువాత 'ఖైదీ' సీక్వెల్ కి రానున్నాడన్న మాట.