ఆసక్తిని రేపుతున్న 'ముగ్గురు మొనగాళ్లు' ఫస్టులుక్
- డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'ముగ్గురు మొనగాళ్లు'
- దర్శకుడిగా అభిలాష్ పరిచయం
- ముగింపు దశలో పోస్ట్ ప్రోడక్షన్ పనులు
అచ్యుత రామారావు నిర్మించిన ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి .. దీక్షిత్ శెట్టి .. వెన్నెల రామారావు ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ ముగ్గురు కథానాయకులలో ఒకరికి కనిపించదు .. ఒకరికి వినిపించదు ... మరొకరు మాట్లాడలేరు. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూనే ఈ సినిమా పోస్టర్ ను ఇలా డిజైన్ చేసి వదిలారు .. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విభిన్నమైన ... విలక్షణమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటోంది. ఈ 'ముగ్గురు మొనగాళ్లు' ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి మరి.