'సలార్'లో ఆర్మీ ఆఫీసర్ గా ప్రభాస్!
- భారీ యాక్షన్ మూవీగా 'సలార్'
- తండ్రీ కొడుకులుగా ప్రభాస్ ద్విపాత్రాభినయం
- ఆర్మీ ఆఫీసర్ గా తండ్రి పాత్ర
- అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు
ప్రభాస్ తండ్రి పాత్రకి సంబంధించిన ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందట. ఈ ఎపిసోడ్ లోనే ఆయన ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ పాత్రను ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన తీరు ఆశ్చర్యచకితులను చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ ఎపిసోడ్ లో వచ్చే 'వార్' సీన్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ప్రభాస్ అభిమానులు విజిల్స్ వేసేలా ఈ ఎపిసోడ్ సాగుతుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికగా శ్రుతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.