'లూసిఫర్' రీమేక్ నుంచి డైరెక్టర్ తప్పుకున్నాడా?
- మలయాళంలో హిట్ మూవీ
- చిరూ ఆసక్తిని చూపిన కథ
- దర్శకుడిగా మోహన్ రాజా ఎంపిక
- తప్పుకున్నట్టుగా వార్తలు
- వినాయక్ కి దక్కే ఛాన్స్ ఎక్కువ
ఈ సినిమా రీమేక్ బాధ్యతలను తమిళ దర్శకుడు .. ఎడిటర్ మోహన్ కుమారుడు మోహన్ రాజాకి ఇచ్చారు. కొంతకాలంగా తెలుగు నేటివిటీకి తగిన మార్పులు జరుగుతూ వస్తున్నాయి. అయితే వాటి విషయంలో చిరంజీవి అసంతృప్తిగానే ఉన్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్టు నుంచి మోహన్ రాజా తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందుకు గల కారణమేమిటనేది మాత్రం తెలియదు. మోహన్ రాజా తప్పుకోవడం నిజమే అయితే, ఈ ప్రాజెక్టు వినాయక్ చేతికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది.