బాలయ్య కోసం రెడీ చేసిన కథ మామూలుగా ఉండదట!
- బాలకృష్ణతో అనిల్ రావిపూడి
- మాస్ అంశాలే ప్రధానంగా సాగే కథ
- వచ్చే ఏడాదిలోనే సెట్స్ పైకి
ప్ర్రస్తుతం బాలకృష్ణ .. బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను దసరాకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ తరువాత ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్నాడు. బాలకృష్ణ పుట్టిన రోజున ఈ సినిమా ప్రారంభోత్సవం జరగొచ్చని అంటున్నారు. ఆ తరువాతనే అనిల్ రావిపూడి సినిమా మొదలవుతుందని చెబుతున్నారు. ఈ లోగా 'ఎఫ్ 3'తో పాటు మహేశ్ బాబుతో సినిమాను కూడా అనిల్ రావిపూడి పూర్తిచేస్తాడన్న మాట.