మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో 'జాతిరత్నాలు' డైరెక్టర్!
- చిన్న సినిమాగా వచ్చిన 'జాతిరత్నాలు'
- రికార్డుస్థాయిలో రాబట్టిన వసూళ్లు
- సీక్వెల్ దిశగా సన్నాహాలు
- మరో కథపై కూడా కసరత్తు
అయితే 'జాతిరత్నాలు'తో తనకి అవకాశం ఇచ్చిన నాగ్ అశ్విన్ కే ఆయన మరో సినిమా చేస్తున్నాడు. ఈ కథ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో నడుస్తుందట. అయితే ఇదేదో పూర్తి యాక్షన్ మూవీ అనుకుంటే పొరపాటే. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్టైనరే. ప్రస్తుతం ఈ కథపైనే అనుదీప్ కసరత్తు చేస్తున్నాడట. నాగ్ అశ్విన్ ఎప్పటికప్పుడు కథలో మార్పులు .. చేర్పులు చెబుతున్నాడని అంటున్నారు. ఇక అనుదీప్ దర్శకత్వంలోనే 'జాతిరత్నాలు 2' కూడా రానుంది. మరి ఈ రెండు ప్రాజెక్టులలో దేనిని ముందుగా పట్టాలెక్కిస్తాడో చూడాలి.