బాలకృష్ణ సరసన సందడి చేయనున్న బోల్డ్ బ్యూటీ!
- గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ
- ఇద్దరు హీరోయిన్లకు చోటు
- రాయ్ లక్ష్మికి దక్కిన ఛాన్స్
- త్వరలో సెట్స్ పైకి
ప్రస్తుతం బోయపాటితో బాలకృష్ణ 'అఖండ' చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆలస్యమవుతోందిగానీ, వాస్తవానికి ఈ నెలలో ఈ సినిమా థియేటర్లకు రావలసింది. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నారు. ఈ సినిమాలో ముందుగా రాయ్ లక్ష్మితో ఒక ఐటమ్ చేయిద్దామని అనుకున్నారట. ఆ తరువాత ఆమెనే మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో 'అధినాయకుడు' సినిమాలో బాలకృష్ణతో రాయ్ లక్ష్మి జోడీ కట్టింది .. ఇది రెండవసారన్న మాట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.