కుదిరితే దసరాకి .. లేదంటే క్రిస్మస్ కి 'పుష్ప'?
- అడవి నేపథ్యంలో సాగే 'పుష్ప'
- విభిన్నమైన పాత్రలు .. ఆసక్తికర మలుపులు
- చాలావరకూ చిత్రీకరణ పూర్తి
ఈ సినిమాను ఆగస్టు 13వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా అప్పటికీ పూర్తిస్థాయి పనులు కాకపోవచ్చని అనుకుంటున్నారట. అందువలన కుదిరితే 'దసరా' బరిలోకి దింపాలనీ .. లేదంటే 'క్రిస్మస్' కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇతర సినిమాల విడుదల తేదీలను బట్టి, ఈ విషయంలో ఇంకా మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. కానీ ప్రస్తుతమైతే ఈ విషయాన్ని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. జూన్ నాటికి ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.