ప్రభాస్ జోడీగా కత్రినా కైఫ్? .. వెండితెరపై అల్లకల్లోలమే!
- పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్
- పోటీపడుతున్న బాలీవుడ్ దర్శకులు
- లైన్లోనే సిద్ధార్థ్ ఆనంద్ ప్రాజెక్ట్
ఈ సినిమాలు ఎప్పుడు పూర్తవుతాయనేది తెలియదు .. కానీ ప్రభాస్ మాత్రం తన దూకుడు ఆపడం లేదు. 'వార్' వంటి యాక్షన్ సినిమాలతో 'ఔరా'! అనిపించిన సిద్ధార్థ్ ఆనంద్ కి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఆయన 'కత్రినా కైఫ్' ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎంపిక దాదాపు ఖాయమవుతుందనే అంటున్నారు. కత్రినా మంచి పొడగరి కనుక .. తెరపై ఈ జోడీ ఒక రేంజ్ లో సందడి చేయవచ్చు. శ్రద్ధా కపూర్ .. కృతి సనన్ తరువాత ప్రభాస్ సరసన కత్రినా కనువిందు చేయనుందన్న మాట.