'యాత్ర' దర్శకుడితో నితిన్?
- నితిన్ తాజా చిత్రంగా 'అంధాదున్'
- తరువాత ప్రాజెక్టుగా 'పవర్ పేట'
- నితిన్ నిర్ణయం కోసమే వెయిటింగ్
నితిన్ నుంచి ఈ ఏడాదిలో వచ్చిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆయన మరింతగా దృష్టిపెట్టాడు. 'అంధాదున్' రీమేక్ చేస్తున్న ఆయన ఆ తరువాత మరో ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టాడు. తరువాత సినిమాగా 'పవర్ పేట' ఉండొచ్చునని అంటున్నారు. ఒకవేళ రాఘవ్ చెప్పిన కథకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, 'పవర్ పేట' తరువాత ఉంటుందనే అనుకోవాలి. మరి నితిన్ ఓకే చెబుతాడో లేదో చూడాలి.