'రంగస్థలం' సీక్వెల్ కి రెడీ అవుతున్నారా?
- శంకర్ తో సెట్స్ పైకి వెళ్లనున్న చరణ్
- విజయ్ దేవరకొండ ప్రాజెక్టుతో సుకుమార్
- ఆ తరువాత రంగంలోకి చరణ్ - సుకుమార్
సుకుమార్ - చరణ్ కాంబినేషన్లో 2018 మార్చిలో వచ్చిన 'రంగస్థలం' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చిట్టిబాబు పాత్రలో చరణ్ జీవించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని సుకుమార్ - చరణ్ ఇద్దరూ కూడా నిర్ణయించుకున్నారని చెప్పుకుంటున్నారు. శంకర్ సినిమాను చరణ్ పూర్తి చేసేలోగా, విజయ్ దేవరకొండతో సినిమాను సుకుమార్ పూర్తిచేస్తాడు. ఆ తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్న మాట.