'అఖండ' టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్!
- బోయపాటితో బాలయ్య మూడో సినిమా
- యాక్షన్ దృశ్యాల్లో చెలరేగిపోయిన బాలయ్య
- రాకెట్ లా దూసుకుపోతున్న టీజర్
'ఉగాది' పండగ సందర్భంగా నిన్న ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. సాక్షాత్తు పరమశివుడు కొలువైన ప్రదేశంలో దుష్ట శిక్షణ చేసే అపర కాలభైరవుడిగా ఈ టీజర్ లో బాలకృష్ణ కనిపించారు. ఆయన లుక్ మంచి మార్కులు కొట్టేసింది. హరహర మహాదేవ అంటూ దుర్మార్గులపై ఆయన విరుచుకుపడిన తీరుకి మంచి రెస్పాన్స్ వస్తోంది.
24 గంటలు పూర్తి కాకుండానే 6 మిలియన్లకి పైగా వ్యూస్ ను సాధించి నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. సినిమాఫై అంచనాలు పెంచే దిశగానే ఈ టీజర్ దూసుకుపోతోంది. ఈ టీజర్ చూసినవాళ్లు, బాలకృష్ణ - బోయపాటికి హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమని చెప్పుకుంటున్నారు.