సెన్సార్ పూర్తి చేసుకున్న 'వకీల్ సాబ్'
- పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో 'వకీల్ సాబ్'
- 'వకీల్ సాబ్' చిత్రానికి U/A సర్టిఫికెట్
- ఏప్రిల్ 9న గ్రాండ్ రిలీజ్
- నిన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న 'వకీల్ సాబ్'
- వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చిత్రం
బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్రలో వచ్చిన 'పింక్' చిత్రానికి తెలుగు నేటివిటీకి, పవన్ ఇమేజ్ కు తగిన విధంగా మార్పులు చేసి 'వకీల్ సాబ్' గా రీమేక్ చేశారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతి హాసన్ కథానాయిక కాగా... కీలకపాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాశ్ రాజ్ నటించారు. తమన్ సంగీతం అందించిన 'వకీల్ సాబ్' పాటలకు విశేషమైన ప్రజాదరణ లభిస్తోంది. నిన్ననే హైదరాబాదు శిల్పకళావేదికలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకుంది.