అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో విలన్ ఎవరో చెప్పేసిన సినీ యూనిట్!
- సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా
- విలన్‌గా మలయాళ నటుడు ఫవాద్ ఫాజిల్
- ఆగస్టు 13న సినిమా విడుదల
మలయాళ నటుడు ఫవాద్ ఫాజిల్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు చెబుతూ ఆయన ఫొటోను మైత్రిమూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రాజెక్టు నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్న విషయం తెలిసిందే.
కేరళలో అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అధికంగా ఉంది. అందుకే ఈ సినిమా కోసం మలయాళ నటుడినే విలన్‌గా ఎంపిక చేశారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కానుంది.