కృష్ణవంశీ దర్శకత్వంలో మరో సినిమా.. టైటిల్ 'అన్నం'!
- కృష్ణవంశీ దర్శకత్వంలో 'రంగమార్తాండ'
- ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులు
- వయొలెన్స్ నేపథ్యంలో సాగే 'అన్నం'
ఇదిలావుంచితే, తాజాగా కృష్ణవంశీ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రం పేరు 'అన్నం'. పరబ్రహ్మ స్వరూపం అన్నది దీనికి ట్యాగ్ లైన్. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఈ టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని పేర్కొన్నారు.
ఇక టైటిల్ లోగో గురించి చెప్పాలంటే... అరిటాకులో రక్తపుమరకలతో నిండిన కొడవలి.. తెగిపడిన తాళిబొట్టు.. ఆకునిండా వెదజల్లిన రక్తం.. మధ్యలో అన్నం అనే పేరుతో ఈ లోగోను డిజైన్ చేశారు. వయొలెన్స్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందన్న విషయాన్ని ఈ లోగోతో చెప్పకనే చెప్పారు. అయితే, ఇందులో నటించే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మాత్రం ప్రకటించలేదు.