పవన్ బిజీ బిజీ.. ఒకేరోజు రెండు సినిమాల షూటింగులలో పవర్ స్టార్!
- ప్రస్తుతం సెట్స్ పై రెండు సినిమాలు
- ఉదయం క్రిష్ సినిమా షూటింగ్
- మధ్యాహ్నం రీమేక్ సినిమా షూట్
- షాట్ గ్యాప్స్ లో రాజకీయ చర్చలు
ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాదు శివారులో క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హరిహర వీరమల్లు' చిత్రం షూటింగులో పాల్గొన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రం షూటింగులో పాల్గొన్నారు.
ఇలా ఒకేరోజు స్టార్ హీరో రెండు సినిమాల షూటింగులలో పాల్గొనడం ఇప్పుడు ఒక విశేషంగా చెప్పుకుంటున్నారు. మరోపక్క, షూటింగు గ్యాప్ లలో ఏపీ మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి జనసేన నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారు.