ఈ నెల 28న నింగిలోకి పీఎస్ఎల్వీ సి-51
- మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
- శ్రీహరికోట నుంచి ప్రయోగం
- పూర్తయిన లాంచ్ రిహార్సల్
- ప్రారంభం కానున్న కౌంట్ డౌన్
- 19 ఉపగ్రహాలను మోసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ సి-51
పీఎస్ఎల్వీ సి-51 రాకెట్ ద్వారా అమెజానియా-1తో పాటు మరో 18 ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెడతారు. కాగా, భారత స్టార్టప్ లకు చెందిన రెండు ఉపగ్రహాలను కూడా ఈ వాహకనౌక ద్వారా పంపాలని నిర్ణయించగా, వాటిలో పిక్సెల్ సంస్థ రూపొందించిన ఆనందన్ అనే ఉపగ్రహానికి సాఫ్ట్ వేర్ సమస్యలు తలెత్తాయి. దాంతో ఆ ఉపగ్రహాన్ని జాబితా నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.