నిఖిల్ సరసన నాయికగా మరోసారి అనుపమ
- '18 పేజెస్'లో నటిస్తున్న అనుపమ
- 'కార్తికేయ' చిత్రానికి సీక్వెల్ నిర్మాణం
- ఈ నెల 26న షూటింగ్ ప్రారంభం
ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న '18 పేజెస్' సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటిస్తోంది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ మూవీని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇది నిర్మాణంలో ఉండగానే అనుపమకు నిఖిల్ సరసన నటించే మరో ఛాన్స్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది.
నిఖిల్ హీరోగా గతంలో వచ్చిన 'కార్తికేయ' సినిమా మంచి హిట్టయింది. చందు మొండేటి దర్శకత్వంలోనే నిఖిల్ హీరోగా దీనికి సీక్వెల్ నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా అనుపమను తీసుకుంటున్నట్టు తాజా సమాచారం. ఈ నెల 26 నుంచి షూటింగును నిర్వహించే ఈ 'కార్తికేయ 2' చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ కలసి నిర్మిస్తున్నారు.