రజనీకాంత్ ను కలిసిన కమలహాసన్
- ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కమల్
- రాజకీయాల్లోకి రాలేనని ప్రకటించిన రజనీ
- రజనీ ప్రకటన తర్వాత తొలిసారి కలిసిన కమల్
రజనీకాంత్ ను కమల్ కలవడం తమిళనాట సంచలనంగా మారింది. రజనీ మద్దతు కోరేందుకు కలిశారా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కమల్ సన్నిహితులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య రాజకీయాలు చర్చకు రాలేదని వారు తెలిపారు. 2018లో మక్కల్ నీధి మయ్యమ్ పార్టీని కమల్ ప్రారంభించారు. ఎన్నికలకు సంబంధించి తన మిత్రుడు రజనీ మద్దతు కోరుతానని ఇటీవల కమల్ ప్రకటించారు.