పవన్ సినిమాకి పరిశీలనలో మరో టైటిల్!
- సెట్స్ పై పవన్ నటిస్తున్న రెండు సినిమాలు
- క్రిష్ దర్శకత్వంలో వజ్రాలదొంగగా పవన్
- రీమేక్ సినిమాలో హీరోలుగా పవన్, రానా
- తాజాగా పరిశీలనలో 'రుద్రప్రతాప్' టైటిల్
ఇక వీటిలో క్రిష్ సినిమా విషయానికి వస్తే, ఇందులో పవన్ వజ్రాలదొంగగా నటిస్తున్నారు. ఆయన సరసన నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'హరిహర వీరమల్లు' అనే టైటిల్ని నిర్ణయిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మరోపక్క, 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రం రీమేక్ లో పవన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. మొదట్లో ఈ చిత్రానికి 'బిల్లా రంగా' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారాన్ని బట్టి, దీనికి 'రుద్రప్రతాప్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తుండడం విశేషం!