పూరి, రవితేజ కాంబినేషన్లో మరో సినిమా?
- రవితేజ, పూరి కలయికలో పలు హిట్స్
- తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ సినిమా
- కథను సిద్ధం చేసిన దర్శకుడు పూరి
అయితే, 'దేవుడు చేసిన మనుషులు' సినిమా తర్వాత వీరి కలయికలో మళ్లీ సినిమా రాలేదు. అంటే సుమారు తొమ్మిదేళ్ల నుంచి వీరిద్దరూ కలసి పనిచేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరి కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన కథను కూడా పూరి ఇప్పటికే సిద్ధం చేసినట్టు, ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పూరి 'లైగర్' సినిమా చేస్తుండగా.. రమేశ్ వర్మతో రవితేజ 'ఖిలాడి' సినిమా చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజక్టులు పూర్తయ్యాక వీరిద్దరి కలయికలో సినిమా సెట్స్ కి వెళుతుందని సమాచారం.