సాగు చట్టాలను వెనక్కి తీసుకోకుంటే రాజీనామా: స్పీకర్‌కు లేఖ రాసిన హర్యానా ఎమ్మెల్యే
- 26లోగా చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
- సాగు చట్టాలను నల్ల చట్టాలుగా అభివర్ణించిన ఎమ్మెల్యే
- తాను కూడా బయటకు వెళ్తానన్న జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతుల్లో ఇప్పటి వరకు దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారని, అయినప్పటికీ కేంద్రం స్పందించడం లేదని అభయ్‌సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా రైతు నిరసనల్లో తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కాగా, హర్యానాలో బీజేపీకి మద్దతు ఇస్తున్న జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా కూడా ఇలాంటి డిమాండే చేశారు. మద్దతు ధరపై హామీ ఇవ్వకుంటే మద్దతుపై పునరాలోచిస్తానని హెచ్చరించారు.