సంక్రాంతి కానుకగా 'వకీల్ సాబ్' టీజర్... ముహూర్తం ఖరారు
- పవన్ ప్రధాన పాత్రలో 'వకీల్ సాబ్'
- నెట్టింట సందడి చేస్తున్న 'వకీల్ సాబ్' విశేషాలు
- జనవరి 14 సాయంత్రం టీజర్ విడుదల
- వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చిత్రం
బాలీవుడ్ లో వచ్చిన 'పింక్' చిత్రాన్ని 'వకీల్ సాబ్' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'పింక్' లో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను పవన్ 'వకీల్ సాబ్' లో చేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. కథలో కీలకమైన పాత్రల్లో అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.